45 మంది తాలిబన్‌ ఉగ్రవాదులు హతం

- May 09, 2016 , by Maagulf
45 మంది తాలిబన్‌ ఉగ్రవాదులు హతం

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో తాలిబన్‌ ఉగ్రవాదులు పన్నిన ఉగ్రదాడులను అఫ్గానిస్థాన్‌ భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. కునార్‌ ప్రావిన్స్‌లోని ఘజియాబాద్‌ జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 45 మంది తాలిబన్‌ ఉగ్రవాదులు మృతిచెందారు. ఘజియాబాద్‌లోని పలు సెక్యూరిటీ పోస్టుల వద్ద ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు యత్నించగా విజయవంతంగా తిప్పికొట్టినట్లు అఫ్గాన్‌ నేషనల్‌ ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఉగ్రవాదులు కునార్‌ ప్రావిన్స్‌లోనే ఎక్కువగా దాడులకు పాల్పడుతుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com