సౌదీలో ఈద్ అల్-ఫితర్ కు సిద్ధమైన 20,700 మస్జీదులు

- April 20, 2023 , by Maagulf
సౌదీలో ఈద్ అల్-ఫితర్ కు సిద్ధమైన 20,700 మస్జీదులు

రియాద్: ఈద్ అల్-ఫితర్ ప్రార్థనల కోసం సౌదీ అరేబియా చుట్టూ 20,700 మస్జీదులు సిద్ధమైనట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ప్రకటించింది. మస్జీదులు,  ప్రార్థన ప్రాంతాలను పర్యవేక్షించడానికి 6,000 కంటే ఎక్కువ మంది పరిశీలకులను నియమించినట్లు తెలిపింది. మస్జీదుల కోసం అందించిన సేవల్లో లోపాలను గమనించినట్లయితే తమకు నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. అదే విధంగా ఈద్ ప్రార్థనకు హాజరైన వారు జుమా ప్రార్థన కాకపోతే ధుహర్ ప్రార్థన చేయడం తప్పనిసరి అని పర్మినెంట్ కమిటీ ఫర్ స్కాలర్లీ రీసెర్చ్ అండ్ ఇఫ్తా ఫత్వాను ఉటంకిస్తూ మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com