జ్యువలరీ షాప్‌కి వెళితే ఐడీ కార్డ్ తప్పనిసరి
- May 09, 2016
రాయల్ ఒమన్ పోలీసుల సూచన మేరకు జ్యువలరీ షాపులు ఇకపై వినియోగదారులకు 'ఐడీ కార్డ్' తప్పనిసరి చేశాయి. భద్రతా చర్యల్లో భాగంగానే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఇప్పటివరకు బంగారం మార్పిడి, అమ్మకాల వరకు మాత్రమే వినియోగదారుల్ని ఐడీ కార్డ్ కోసం జ్యుయెలరీ షాప్‌లు అడిగేవి. ఇకపై, బంగారం కొనుగోళ్ళకు కూడా ఐడీ కార్డ్‌లు తప్పనిసరిగా ఉండాలి. వరుస ఘటనలతో అప్రమత్తమయ్యామనీ, దొంగతనాల్ని అరికట్టడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని రాయల్ ఒమన్ పోలీసు సీనియర్ అధికారి వెల్లడించారు. జ్యువలరీ షాపుల్లో దొంగతనాలు పెరగడం బంగారం వర్తకుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. దాంతో రాయల్ ఒమన్ పోలీసుల సూచన మేరకు కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈ విధానం పట్ల బంగారు దుకాణాలే కాకుండా వినియోగదారులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







