అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఏపీ సీఎం జగన్ ఆదేశం
- April 20, 2023
అమరావతి: ఏపీలో ఖాళీగా వున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్స్ పోస్టులతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసారు. గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల్లో ‘నాడు – నేడు’ పనులపై జగన్ సమీక్షించారు. ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా మారిన సుమారు 10 వేలకు పైగా అంగన్వాడీల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మిగిలిన సుమారు 45 వేల అంగన్వాడీల్లో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలని సీఎం జగన్ సూచించారు. అంగన్వాడీ సెంటర్లలో ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటి? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలన్నారు. ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, టాయిలెట్లు లాంటి సౌకర్యాలపై సమాచారం తెప్పించుకోవాలని పేర్కొన్నారు.
పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్ మెంట్ ను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. సంపూర్ణ పోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంత ఎస్వోపీని రూపొందించాలన్నారు. పెన్షన్ల తరహా సంపూర్ణ పోషణ పంపిణీ కూడా సమర్థవంతంగా ఉండాలన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







