బహ్రెయిన్‌లో తాజా నోట్ల కొరత..!

- April 22, 2023 , by Maagulf
బహ్రెయిన్‌లో తాజా నోట్ల కొరత..!

బహ్రెయిన్: ఈద్ సందర్భంగా ప్రియమైన వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఈద్ సంప్రదాయాలలో ఒకటి. కొత్త దుస్తులు, స్వీట్‌ బాక్సులు, తాజాగా ముద్రించిన బ్యాంకు నోట్లను సాధారణంగా ఇస్తుంటారు. బహ్రెయిన్ లో తాజా నోట్లను పొందడం కష్టంగా మారిందని, ప్రత్యేక సందర్భాలలో తాజా నోట్ల కొరత వేధిస్తుందని ఓ బ్యాంకర్ తెలిపారు. తాజా నోట్లకు భారీగా డిమాండ్ ఉందని, ప్రత్యేకించి ఈద్ సమయంలో పౌరులు, నివాసితుల తాజా బ్యాంకు నోట్ల కోసం డిమాండ్ ఉందన్నారు. బ్యాంకులు ఈ కొత్త నోట్లను కొన్ని గంటలపాటు మాత్రమే పంపిణీ చేస్తున్నాయని, అవి త్వరగా అయిపోతున్నాయని అధికారి తెలిపారు.

680 మిలియన్ నోట్లు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ తాజా గణాంకాల ప్రకారం.. 680 మిలియన్ల నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటిలో 150 మిలియన్ దినార్లు బ్యాంకుల్లో ఉండగా.. 530 మిలియన్ దినార్లు మార్కెట్ సర్క్యులేషన్ లో ఉన్నాయి. అదే విధంగా 200 మిలియన్ల నాణేలు చెలామణిలో ఉన్నాయని గణంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, 40 మిలియన్ల హాఫ్ దినార్ నోట్లు, 25.60 మిలియన్-దినార్ నోట్లు, 7.38 మిలియన్ ఐదు-దినార్ నోట్లు, 7.16 మిలియన్ పది-దినార్ నోట్లు, 25.66 మిలియన్ ఇరవై-దినార్ నోట్లు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com