ఖతార్లో అతి విశిష్టమైన రమదాన్ ఫిరంగి

- June 22, 2015 , by Maagulf
ఖతార్లో అతి విశిష్టమైన రమదాన్ ఫిరంగి

1970వ సంవత్సరం నుండి ఖతార్లో రమదాన్ చిహ్నమైన, ప్రతి సాయంత్రం ఉపవాస దీక్ష విరామాన్ని తెలియచేసేది - దేశంలోనే అతి విశిష్టమైన ఫిరంగి. ఇది క్రితం సంవత్సరం వరకు జనరల్ జనరల్ పోస్ట్ ఆఫీసులో (GPO) ఉండగా, ఈ సంవత్సరం డాఫ్నలోనున్న  రాజ్య మసీదు ఐన మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ మసీదులోకి మార్చబడింది.

పూర్వం రోజుల్లో ఖతార్ ప్రజలు ఈ ఫిరంగి పేలుడు విన్న తరువాత మాత్రమే ఉపవాస దీక్షను సడలించేవారు. కతర్ లో   పిల్లలు ఈ ఫిరంగి పేల్చే ప్రత్యేక  సంప్రదాయాన్ని చాలా ఇష్టపడతారు. ఖతార్ టెలివిజన్, ఈ కార్యక్రమాన్ని మగ్రీబ్ ప్రార్ధనకు ముందు, ఇఫ్తార్ సూచకంగా ప్రతి సాయంత్రం ప్రసారం చేస్తుంది.


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com