అబుధాబిలో కారు ప్రమాదం..భారతీయ ప్రవాసుడు మృతి
- April 23, 2023
యూఏఈ: అబుధాబి అల్ మఫ్రాక్ ప్రాంతంలో జరిగిన ఓ కారు ప్రమాదంలో ప్రవాస భారతీయుడు మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన సుబీష్ చోజియంపరంబత్ 36 ఏళ్లు నిండడానికి సరిగ్గా ఒక నెల ముందు ఏప్రిల్ 20న మరణించాడు. ఇదే ప్రమాదంలో గాయపడ్డ ఒకరు తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరొక వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు సుబీష్ బంధువు వెల్లడించారు. గత రెండేళ్లుగా అబుధాబిలో నివాసముంటున్న సుబీష్ ల్యాండ్‌స్కేపింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో తను పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఈద్ అల్ ఫితర్ సెలవులకు ముందు షాపింగ్ కోసం సుబీష్ ఇతరులతో కలిసి అతను నివసించే అల్ సమ్హా నుండి ముస్సాఫాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!









