యూఏఈ మూన్ మిషన్: మూన్ పై రషీద్ రోవర్ స్పేస్ క్రాఫ్ట్ హార్డ్ ల్యాండింగ్..!

- April 26, 2023 , by Maagulf
యూఏఈ మూన్ మిషన్: మూన్ పై  రషీద్ రోవర్ స్పేస్ క్రాఫ్ట్ హార్డ్ ల్యాండింగ్..!

యూఏఈ: అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించాలనుకున్న యూఏఈకి నిరాశ ఎదురైంది. రషీద్ రోవర్‌ను చంద్రుడిపైకి తీసుకువెళుతున్న జపాన్ అంతరిక్ష నౌకతో కమ్యూనికేషన్ తెగిపోయనట్లు మిషన్ కంట్రోల్ వెల్లడించింది. ల్యాండర్ ను తీసుకెళ్లిన స్పేష్ షిప్ చంద్రుడి ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ అయినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఆపరేషన్ జరిగి 8 గంటలు అవుతున్నా.. HAKUTO-R మిషన్ 1 (M1) స్థితి గురించిన అప్‌డేట్‌ తెలియరాలేదు. జపాన్‌కు చెందిన ఇస్పేస్, ల్యాండర్ -మిషన్ కంట్రోల్ సెంటర్ (MCC) మధ్య కమ్యూనికేషన్ ఏర్పడలేదని తెలుస్తోంది.

ఏడు అడుగుల M1 మిషన్ మంగళవారం సాయంత్రం 100 కిలోమీటర్ల కక్ష్య నుండి ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభించింది.యూఏఈ కాలమానం ప్రకారం.. 8.40pm సమయానికి ఫ్లైట్ ఇంజనీర్లు M1తో కమ్యూనికేషన్‌ను కోల్పోయినప్పుడు ల్యాండింగ్ దాదాపు పూర్తయిందని లైవ్ టెలిమెట్రీ డేటా ఆధారంగా నిర్ధారించారు.

కమ్యూనికేషన్ కష్టమే..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా.. టోక్యోలోని నియంత్రణ కేంద్రం చంద్రుని ఉపరితలంపై తుది ప్రక్రియను నిర్వహించినప్పుడు ల్యాండర్ నిలువుగా ఉన్నట్లు నిర్ధారించింది. "షెడ్యూల్డ్ ల్యాండింగ్ సమయం ముగిసిన కొద్దిసేపటి తర్వాత, టచ్‌డౌన్‌ను సూచించే డేటా ఏదీ అందుకోలేదు. దిగువ థ్రెషోల్డ్‌కు చేరుకున్న అంచనా వేసిన మిగిలిన ప్రొపెల్లెంట్‌ను ఐస్పేస్ ఇంజనీర్లు పర్యవేక్షించారు. కొద్దిసేపటి తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ వేగంగా జరిగింది. ప్రస్తుతానికి కమ్యూనికేషన్ ఏర్పడటం లేదు. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా.. ల్యాండర్ చివరికి చంద్రుని ఉపరితలంపై గట్టిగా ల్యాండింగ్ అయినట్లు భావిస్తున్నాం" అని ఇస్పేస్ ప్రకటించింది.  జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) ప్రెసిడెంట్ హిరోషి యమకావా మాట్లాడుతూ.. చంద్రునిపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించిన మొదటి ప్రైవేట్ కంపెనీగా ఇస్పేస్ అవతరించిందన్నారు. ఇస్పేస్ ఈ మిషన్ నుండి పొందిన డేటాను విశ్లేషిస్తుందని, తదుపరి మిషన్‌కు ఇది పునాదిగా ఉపయోగపడుతుందన్నారు.

ఈ ప్రయోగం విజయవంతం అయితే,  చంద్రుని ల్యాండింగ్‌ను పూర్తిచేసిన మొదటి ప్రైవేట్ కంపెనీగా ఇస్పేస్ అవతరించేది.అమెరికా, మాజీ సోవియట్ యూనియన్(రష్యా), చైనా మాత్రమే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండెడ్ అంతరిక్ష టెక్నాలజీలను కలిగి ఉన్నాయి. ఇటీవల సంవత్సరాలలో భారతదేశం, ఒక ప్రైవేట్ ఇజ్రాయెల్ కంపెనీ చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com