ఇండియా-యూఏఈ ట్రావెల్: ఎయిర్ ఇండియా సమ్మర్ ఫ్లైట్ షెడ్యూల్ విడుదల
- April 27, 2023
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా దుబాయ్ కి మరిన్ని నాన్‌స్టాప్ ఫ్లైట్లను ప్రకటించింది. ఇవి ఢిల్లీ, ముంబై నుంచి నేరుగా నడువనున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లు ప్రస్తుత వేసవి షెడ్యూల్లో భాగంగా ఈ రెండు నగరాల నుంచి రోజువారీ సర్వీసుల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 29 నుంచి ఢిల్లీ, దుబాయ్ మధ్య విమానాలు (రెండు దిశలలో) డైలీ 10 సర్వీసులు.. ముంబై, దుబాయ్ మధ్య ఇప్పుడు రోజువారీగా నడుస్తున్న విమాన సర్వీసుల సంఖ్య 6కు పెరగనున్నాయి. ఎయిర్ ఇండియా సమ్మర్ ఫ్లైట్ షెడ్యూల్ ప్రకారం.. ఇకపై ఇండియా నుంచి దుబాయ్ కి విమాన సర్వీసులు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అందుబాటులో ఉంటాయి. దుబాయ్ రూట్ లో బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను (బిజినెస్ క్లాస్‌లో 18 ఫ్లాట్ బెడ్లు, 238 ఎకానమీ క్లాస్ సీట్లు కలిగి ఉంటుంది) రోజువారీ విమాన సర్వీసుల్లో అత్యధిక భాగం కల్పించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్‌లలో ప్రయాణికులు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.

తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







