షార్జాలో భారీ డ్రగ్స్ ముఠాల గుట్టురట్టు.. 24 మంది అరెస్ట్

- April 27, 2023 , by Maagulf
షార్జాలో భారీ డ్రగ్స్ ముఠాల గుట్టురట్టు.. 24 మంది అరెస్ట్

యూఏఈ: 24 మంది అరబ్, ఆసియా జాతీయుల ముఠాను షార్జా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. వారి నుంచి 120 కిలోగ్రాముల హషీష్, మూడు మిలియన్ క్యాప్‌గాన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్‌లో 23.5 మిలియన్ దిర్హామ్‌లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. షార్జా పోలీస్‌లోని యాంటీ నార్కోటిక్స్ విభాగం డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మాజిద్ అల్-అస్సామ్ బుధవారం (ఏప్రిల్ 26) విలేకరులతో మాట్లాడుతూ.. పక్కా సమాచారంతో అధికాకులు రెండు వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనంలో చేసుకోవడంతోపాటు ముఠాల సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దుబాయ్ పోలీసులు, అజ్మాన్ పోలీసులు, జాయింట్ ఫెడరల్ టీమ్‌ల సహకారం, సమన్వయంతో డ్రగ్స్ ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.  దుబాయ్ పోలీసుల సహకారంతో షిప్పింగ్ కంటైనర్‌లలో ఒకదానిలో నిల్వ చేసిన 3,000,000 క్యాప్‌టాగన్ టాబ్లెట్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే సమయంలో అజ్మాన్ పోలీసుల సహకారంతో మరో ఆపరేషన్ నిర్వహించి 120 కిలోల హషీష్‌ను స్వాధీనం చేసుకున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ అల్-అస్సామ్ తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com