సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలపై జర జాగ్రత్త: యూఏఈ
- April 29, 2023
యూఏఈ: అబుధాబి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం శుక్రవారం సోషల్ మీడియలో మోసం చేసే ప్రకటనలపై నివాసితులను హెచ్చరించింది. క్విక్ లాభాలు, ఆకర్షణీయమైన రాబడి, అధిక రివార్డులను వాగ్దానం చేసే స్కామ్‌లు ఇటీవల పెరిగినట్లు హెచ్చరించింది. ఆన్‌లైన్ ప్రకటనల ద్వారా కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, మోసపూరిత ప్రకటనలకు స్పందించవద్దని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. ఇటువంటి సంస్థలు మోసపూరిత పద్ధతులను ఉపయోగిస్తాయని, సోషల్ మీడియాలో తమను తాము ప్రచారం చేసుకుంటాయని, తప్పుడు ప్రకటనలతో కుచ్చుటోపి పెడతాయని సూచించింది. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి దేశంలోని సంబంధిత అధికారులు జారీ చేసిన సదరు కంపెనీల లైసెన్సులను చెక్ చేయాలని కమ్యూనిటీ సభ్యులను కోరింది. వైర్ మోసం చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని, నేరస్థులకు కఠిన శిక్షలు ఉంటాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఏదైనా మోసపూరిత మార్గాలను ఉపయోగించి ఇతరులను మోసం చేస్తే.. అలాంటి వారికి కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు Dh1,000,000 వరకు జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







