కోమాలోకి వెళ్లిన 62 సంవత్సరాల వృద్ధురాలు ప్రాణాలను కాపాడిన మెడికవర్ వైద్యులు
- April 29, 2023
హైదరాబాద్: 62 సంవత్సరాల వృద్ధురాలు మెడికవర్ హాస్పిటల్స్ నందు అత్యవసర విభాగానికి ప్రాణాపాయ స్థితిలో రావడం జరిగింది. ఆమెకి రెండు కిడ్నీ లలో ఇన్ఫెక్షన్ మరియు నియంత్రణ లేని డయాబెటిస్ , హై బిపి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు.ఆమెకి ఇన్ఫెక్షన్ ముదిరి రక్తం లో చీము పట్టడంతో బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ అయ్యి, అన్ని అవయవాలు సోకి ప్రమాద స్థితికి చేరుకొని కోమా లోకి వెళ్ళారు. అటువంటి స్థితిలో మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగానికి రావడం జరిగింది.ఎమర్జెన్సీ డాక్టర్ల బృందం సకాలంలో స్పందించారు. అనంతరం డాక్టర్ యూరాలజిస్ట్ డాక్టర్ రవితేజ రామిశెట్టి నేతృత్వంలో పేషెంట్ ని ఇంట్యూబేషన్ చేసి ICU కి తరలించారు.అక్కడ వెంటిలేటర్ మీద చికిత్స అందించడం, కిడ్నీ స్టెంటింగ్ చేసి కిడ్నీ లలో చీము బైటికి తీయడం జరిగింది.ICU వైద్యులు, నర్సింగ్ సిబ్బంది 24x7 అహర్నిశలు శ్రమించి తనకి సరైన వైద్యం చేయడం జరిగింది. పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడిన తర్వాత వెంటిలేటర్ తీయడం జరిగింది. దాదాపు మూడు వారాల చికిత్స అనంతరం తాను ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడటం జరిగింది. తను మామూలుగా మాట్లాడటం ఎంతో సంతోషం కలిగించింది అని డాక్టర్ అన్నారు.
అనంతరం సెంటర్ హెడ్ శ్రీకాంత్ మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన డాక్టర్లచే, 24x7 ఎమర్జెన్సీ సేవలు వల్ల ఇటువంటివి సాద్యపడుతున్నాయి అని అన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







