ప్లేటు మార్చేసిన పూరీ.! బాలయ్యకి కనెక్ట్ అయ్యాడా.?
- April 29, 2023
‘లైగర్’ సినిమాతో తగిలిన దెబ్బకి పూరీ జగన్నాధ్ దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్పొచ్చేమో. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి పుణ్యమా అని, ఓ చిన్న రోల్ చేసి, పూరీ మళ్లీ రిలాక్స్ మూడ్‌కి వచ్చారు ‘లైగర్’ దెబ్బ నుంచి కాస్త కోలుకున్నట్లుగా కనిపించాడు.
ఇదే హుషారులో చిరంజీవికి ఓ కథ చెప్పి, ఆయనతో సినిమాకి ఒప్పించుకున్నారు కూడా. ఇదిలా వుంటే, తాజాగా పూరీ జగన్నాధ్, బాలయ్య కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందన్న గాసిప్ చక్కర్లు కొడుతోంది.
మెగాస్టార్ చిరంజీవి మూవీతో పాటూ, ఓ యంగ్ హీరో మూవీ కూడా పూరీ లిస్టులో వువ్నాయ్ ప్రస్తుతం. అలాగే, సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ హిట్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ కూడా పూరీ యోచనలో వుంది.
అయితే, తాజా గాసిప్ ప్రకారం, ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్‌నే బాలయ్యతో తీయబోతున్నాడు పూరీ అని తెలుస్తోంది. దానికి ‘కాకా’ అనే టైటిల్ కూడా పెట్టాడనీ ప్రచారం జరుగుతోంది. అన్నట్లు గతంలో ‘పైసా వసూల్’ అనే సినిమా తీశాడు బాలయ్యతో పూరీ. ఏమో, జరుగుతున్న ప్రచారం ప్రకారం నిజంగానే బాలయ్యతో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ తీస్తున్నాడా పూరీ.? అనేది నిదానంగా తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









