హీరోయిన్ కోసం డైరెక్టర్ తేజకి హ్యాండిచ్చిన గోపీచంద్.!

- April 29, 2023 , by Maagulf
హీరోయిన్ కోసం డైరెక్టర్ తేజకి హ్యాండిచ్చిన గోపీచంద్.!

ఎంతో మంది ఆర్టిస్టులను తెలుగు తెరకు పరిచయం చేసిన ఖ్యాతి డైరెక్టర్ తేజది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయం’ సినిమాలో హీరో నితిన్‌తో పాటూ, హీరోయిన్ సదా, విలన్ గోపీచంద్‌ తదితరులు పరిచయం అయ్యారు.
హీరో, హీరోయిన్ల సంగతి అటుంచితే, విలన్‌గా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత హీరోగా స్టార్‌డమ్ దక్కించుకున్నాడు. 
హీరో అయ్యాకా మరోసారి తేజ, గోపీచంద్‌కి ఛాన్సిచ్చాడట. ఓ కథ చెప్పాడట. ఆ కథలో హీరోయిన్ పాత్రకీ ప్రాధాన్యత వుందట. అయితే, ఆ ప్రాధాన్యతకు తగ్గ హీరోయిన్ దొరక్కపోవడంతో, అప్పట్లో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట.
ఆ ప్రాజెక్ట్ కోసం చాలా సార్లు గోపీచంద్‌కి తేజ ఫోన్ చేయగా గోపీచంద్ ఫోన్ ఎత్తలేదట. తాజాగా ‘రామబాణం’ సినిమా ప్రమోషన్లలో తేజ‌తో స్పెషల్ చిట్‌చాట్ సందర్భంగా ఈ విషయం గుర్తు చేసుకున్నారు తేజ - గోపీచంద్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com