సోషల్ మీడియాలో అభరణాల అమ్మకాలపై ఒమన్ లో నిషేధం

- April 30, 2023 , by Maagulf
సోషల్ మీడియాలో అభరణాల అమ్మకాలపై ఒమన్ లో నిషేధం

మస్కట్: లైసెన్స్ లేకుండా సోషల్ మీడియా ద్వారా విలువైన లోహాలు, రాళ్లను విక్రయించడం విలువైన లోహాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని వాణిజ్య, పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ (MoCIIP) హెచ్చరించింది. కొంతమంది వ్యక్తులు తమ నుంచి ముందస్తు లైసెన్స్ పొందకుండా వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విలువైన లోహాలు, విలువైన రాళ్లను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది రాయల్ డిక్రీ నం. (109/2000) జారీ చేసిన విలువైన లోహాల నియంత్రణ చట్టం, మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ (123/2003) ద్వారా జారీ చేయబడిన దాని కార్యనిర్వాహక నిబంధనలను ఉల్లంఘించడమేనని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా, ఎవరైనా దీనిని ఉల్లంఘించిన వారిపై మంత్రిత్వ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ వినియోగదారులకు విలువైన లోహాలు, రత్నాలను లైసెన్స్ ఉన్న దుకాణాల నుండి కొనుగోలు చేయాలని.. కొనుగోలు చేసిన తర్వాత అధికారిక ఇన్‌వాయిస్‌ను పొందడంతో పాటు ప్రభుత్వ స్టాంప్ ఉనికిని నిర్ధారించుకోవాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com