యూఏఈ ప్రెసిడెంట్ కప్ విజేతకు భారీ నగదు బహుమతి ప్రకటించిన షార్జా రూలర్

- May 01, 2023 , by Maagulf
యూఏఈ ప్రెసిడెంట్ కప్ విజేతకు భారీ నగదు బహుమతి ప్రకటించిన షార్జా రూలర్

యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్స్ కప్‌తో కిరీటాన్ని కైవసం చేసుకున్న షార్జా ఫుట్‌బాల్ క్లబ్ జట్టును ఆదివారం అల్ బాడీ ప్యాలెస్‌లో సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి అభినందించారు. ఈ సందర్భంగా Dh10 మిలియన్ల బహుమతిని అందించారు.  షార్జా క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ పాలకుడు షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి, షార్జా డిప్యూటీ పాలకుడు షేక్ సుల్తాన్ బిన్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈ ప్రెసిడెంట్స్ కప్‌ను క్లబ్ చరిత్రలో పదోసారి, వరుసగా రెండోసారి షార్జా ఫుట్‌బాల్ క్లబ్ జట్టు గెలుచుకున్నది. టోర్నీని విజయవంతంగా నిర్వహించినందుకు యూఏఈ ఫుట్‌బాల్ అసోసియేషన్ (UAEFA) అధ్యక్షుడు షేక్ రషీద్ బిన్ హుమైద్ అల్ నుయిమిను అ సందర్భంగా వారు అభినందించారు. యూఏఈ ప్రెసిడెంట్ కప్‌ను గెలుచుకున్న షార్జా జట్టును, మేనేజ్‌మెంట్, కోచ్‌లను డాక్టర్ షేక్ సుల్తాన్ అభినందించారు. అబుధాబిలోని మొహమ్మద్ బిన్ జాయెద్ స్టేడియంలో గత శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో షార్జా ఫుట్‌బాల్ క్లబ్ జట్టు అల్ ఐన్ క్లబ్‌పై పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించి యూఏఈ ప్రెసిడెంట్స్ కప్ టైటిల్‌ను సాధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com