ఓలా ఎలక్ట్రిక్ రికార్డు విక్రయాలు..
- May 02, 2023
న్యూ ఢిల్లీ: భారత అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మరో రికార్డును నెలకొల్పింది. ఏప్రిల్ 2023లో విక్రయాల గణాంకాలను అధికారికంగా ప్రకటించింది. ఈవీ (EV) స్కూటర్ మార్కెట్‌లో 40శాతం వాటాను ఓలా కైవసం చేసుకుంది. ఏప్రిల్‌లో 30వేల యూనిట్లకు పైగా విక్రయించి అత్యధిక నెలవారీ విక్రయాలను సాధించింది. వరుసగా 8 నెలల పాటు అమ్మకాల పట్టికలో ఓలా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మొత్తంగా 2023 ఆర్థిక సంవత్సరంలో ఓలా స్కూటర్ విక్రయాల్లో ఏకంగా 40శాతం వాటాను అధిగమించి టాప్ ప్లేసులో నిలిచింది.
ప్రస్తుత రోజుల్లో కస్టమర్లు ఎక్కువగా ప్రపంచ స్థాయి EV ప్రొడక్టులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈవీ వాహనాలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ఓలా సేల్స్ మరింత వేగవంతం చేసేందుకు మరిన్ని ఈవీ స్కూటర్లను మార్కెట్లోకి విస్తరిస్తున్నామని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ అన్నారు.
ఈ డిమాండ్‌ను తీర్చడానికి D2C నెట్‌వర్క్‌ను భారీగా పెంచే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను మరింత వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా అనేక ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECలు) ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ఓలా ఆఫ్‌లైన్ స్టోర్లను విస్తరిస్తున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







