ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తారక్..
- May 02, 2023
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల హోరు కనిపిస్తుంది. ఈ 100వ పుట్టినరోజుని చరిత్రలో నిలిచేలా చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ గత ఏడాది మే 28 నుంచే ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ అంటూ సంవత్సరాది వేడుకలు మొదలు పెట్టారు. మే 28న 100 పుట్టినరోజు కావడంతో నెల ముందు అంటే ఏప్రిల్ 28న విజయవాడ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి శత జయంతి అంకురార్పణ సభ నిర్వహించారు బాలయ్య అండ్ చంద్రబాబు.
ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దూరంగా ఉన్నారు. అసలు ఆ కార్యక్రమం గురించి ఇద్దరు అన్నదమ్ములు ఎక్కడా మాట్లాడలేదు. దీంతో అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే కొంతమంది నెటిజెన్లు మాత్రం.. మే 28న జరిగే శత జయంతి వేడుకకు ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ హాజరవుతారు అంటూ కామెంట్స్ చేశారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఎన్టీఆర్ ఆ వేడుకకు కూడా దూరంగా ఉండబోతున్నాడని తెలుస్తుంది.
మే 28న ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జరగనుంది. ఈ వేడుకకు హాజరు కావాలంటూ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా కలిసి మరి ఆహ్వానించాడు. దీంతో ఆ రోజు ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో నందమూరి అభిమానులు ఏ కార్యక్రమానికి హాజరుకావాలో అన్న సందేహంలో పడ్డారు. కాగా ఖమ్మంలోని విగ్రహం 54 అడుగులు ఎత్తుతో ఎన్టీఆర్ పోషించిన శ్రీకృష్ణుడి రూపంలో ఉండబోతుంది.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







