గోపీచంద్ ‘రామబాణం’ పాజిటివ్ బజ్ బాగుందిగా.!

- May 03, 2023 , by Maagulf
గోపీచంద్ ‘రామబాణం’ పాజిటివ్ బజ్ బాగుందిగా.!

శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న చిత్రం ‘రామబాణం’. టైటిల్‌లోనే అంచనాలు క్రియేట్ చేశాడు ఈ సినిమాతో గోపీచంద్. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘రామబాణం’. 

ఈ నేపథ్యంలో ప్రమోషన్లు జోరందుకున్నాయ్. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ మస్త్ హుషారుగా వున్నాడు గోపీచంద్. ఈ సినిమాలో ఎలాగైనా హిట్టు కొట్టేస్తానని కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు.

‘ఖిలాడీ’ ఫేమ్ డింపుల్ హయాతీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. అదే టైమ్‌లో తన యాక్షన్ ఇమేజ్‌నీ ప్రదర్శిస్తున్నాడు.
‘పక్కా కమర్షియల్’ సినిమాతో ఫ్లాఫ్ చవి చూసిన గోపీచంద్, ఈ సినిమాలో హిట్టు కొడతాడని సినీ వర్గాల్లో అంచనాలున్నాయ్. చూడాలి మరి, ఈ శుక్రవారం ‘రామబాణం’కి ఎలాంటి తీర్పు వెలువడనుందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com