‘ఉగ్రం’ నరేష్‌కి ఈ సారైనా కలిసొస్తుందా.?
- May 03, 2023
‘నాంది’, ‘ఇట్టు మారేడుమిల్లి నియోజకవర్గం’ సినిమాలతో అల్లరి నరేష్ పూర్తిగా మారిపోయాడు. కామెడీ హీరో నుంచి సీరియస్ హీరోగా టర్న్ తీసుకున్నాడు.
అవును నిజమే, అల్లరి నరేష్ కామెడీ హీరోగానే అందరికీ సుపరిచితుడు అయినప్పటికీ, నరేష్‌లో మంచి నటుడు దాగున్నాడు. ఆ నటుడ్ని ఈ మధ్య వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు తన తాజా చిత్రాలతో.
హిట్టు, ఫ్లాప్ అనే సంగతి పక్కన పెడితే, ఆయా సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయ్. ఆ కోవలోనే ‘ఉగ్రం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమా కోసం సీరియస్ పోలీసాఫీసర్ అవతారమెత్తాడు నరేష్. తన భార్యా బిడ్డల మిస్సింగ్ హిస్టరీని చేధించే పోలీసాఫీసర్‌గా నరేష్ కనిపించబోతున్నాడు ఈ సినిమాలో.
యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమా వుండబోతోందనీ ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. చాలా కాన్ఫిడెంట్ అండ్ సెటిల్డ్ పర్ఫామెన్స్తో నరేష్ ఆకట్టుకుంటున్నాడు ఈ సినిమాలో. మే 5న ‘ఉగ్రం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









