కొత్తిమీరతో జ్ఞాపక శక్తి.! ఇది మీకు తెలుసా.?

- May 03, 2023 , by Maagulf
కొత్తిమీరతో జ్ఞాపక శక్తి.! ఇది మీకు తెలుసా.?

కొత్తిమీరను ప్రతీ వంటకంలోనూ విరివిగా వాడేస్తుంటాం. కొత్తిమీరతో వంటకాలకి వచ్చే రుచి.. ఆ కిక్కే వేరప్పా. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చివరలో కొత్తిమీర తగిలిస్తే ఆ టేస్ట్ వేరే లెవల్.

కేవలం రుచి కోసమేనా కొత్తిమీర. కానే కాదు. కొత్తిమీరతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. లినోలిక్, ఫార్మేటిక్ వంటి యాసిడ్స్ వుంటాయ్ కొత్తిమీరలో. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

గుండె సంబంధిత వ్యాధుల్ని రాకుండా ఆపడంలో కొత్తిమీర పాత్ర కీలకం. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండడం వల్ల రోజూ కొత్తిమీర తీసుకుంటే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా వుండొచ్చు.

ప్రతీరోజూ కొత్తిమీరని చక్కెర లేదా తేనెతో కలిపి తీసుకుంటే, జ్ఞాపక శక్తి పెరుగుతుందట. డైజేషన్‌కీ కొత్తిమీర చాలా మంచిది. కొత్తిమీరలోని యాంటిబయోటిక్ మూలకాలు, బ్లడ్‌లోని చక్కెర స్థాయుల్ని అదుపులో వుంచి, ఇన్సులిన్ వుత్పత్తి చేయడంలో దోహదపడతాయ్. అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులు కొత్తిమీర తప్పక తీసుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com