ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
- May 04, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ప్రారంభమైంది. వసంత్ విహార్ లో నిర్మించిన ఈ కార్యాలయం (బీఆర్ఎస్ భవన్) ను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయంను ప్రారంభించారు. అనంతరం లోపలికి అడుగు పెట్టారు. బీఆర్ఎస్ భవన్‌లో దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం ఆవరణంలో బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. కార్యాలయంలో వాస్తుపూజ, సుదర్శన హోమం నిర్వహించారు. ఈ పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యాలయంకు ఎడమ వైపు సమాజ్ వాదీ పార్టీ కార్యాలయం, కుడి వైపు జేడీయూ పార్టీ కార్యాలయం ఉంది.
బీఆర్ఎస్ భవనం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌కు వెళ్లి కుర్చీలో కూర్చున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ భవనం నిర్మాణానికి సీఎం కేసీఆర్ 2021 సెప్టెంబర్ 2న భూమిపూజ చేశారు. ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, నాలుగు ప్రధాన కార్యదర్శుల చాంబర్‌లు ఉన్నాయి. మొదటి అంతస్తులో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు చాంబర్, ఇతర చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, 2, 3 అంతస్తుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, వెంకటేశ్ నేత, కేశవరావు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అయితే, ఈ కార్యాలయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కేసీఆర్ తొలి సమావేశం నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







