పెట్టుబడులకు ఖతార్ స్వర్గధామం
- May 10, 2016
ఖతార్ ప్రపంచ ప్రముఖ ఇన్వెస్టిమెంట్ డెస్టినేషన్స్‌లో ఒకటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిందని మినిస్టర్ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ షేక్ అహ్మద్ బిన్ జస్సిమ్ బిన్ మొహ్మద్ అల్ థని చెప్పారు. కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మేజర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఖతార్ ప్రపంచ దేశాల్లోని వ్యాపారవేత్తల్ని, పెట్టుబడుల్ని ఆకర్షిస్తోందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్ ఖతార్ 13వ ఎడిషన్ ప్రారంభం సందర్భంగా షేక్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ ఖతార్ 2016, 13వ అంతర్జాతీయ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ మరియు బిల్డింగ్ మెటీరియల్ ఎగ్జిబిషన్ మే 12 వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దోహా ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుంది. ఇందులో 900 కంపెనీలు, 37 దేశాల నుంచి పాల్గొంటున్నాయి. ఖతార్‌లో పలు మేజర్ ప్రాజెక్టుల నిర్మాణం షెడ్యూల్ ప్రకారం అత్యంత సమర్థవతంగా నడుస్తుండడంతో ప్రపంచం దృష్టి ఖతార్ వైపు మళ్ళిందని ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రముఖ సంస్థల ప్రతినిథులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







