అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్
- May 06, 2023
తెలంగాణ: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి గల్లా అరుణ, గల్లా జయదేవ్‌లు పాల్గొన్నారు.
అంతకు ముందు మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ ప్రారంభించారు. పెద్ద చెరువు సుందరీకరణ, కేసీఆర్ పార్కులో వాచ్ టవర్ ప్రారంభోత్సవంలో మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాసేపట్లో జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడనున్నారు.
సభ ముగిసిన వెంటనే మినీ ట్యాంక్‌బండ్ వద్ద నిర్మించనున్న ఐల్యాండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసి శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో జంగల్ సఫారీని ప్రారంభించనున్నారు. అటునుంచి హైదరాబాద్‌కు పయణమవుతారు.
తాజా వార్తలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!









