దజీజ్‌లో ప్రవాసుల కోసం మరో ఆసుపత్రి..!
- May 08, 2023
కువైట్: హెల్త్ అస్యూరెన్స్ హాస్పిటల్స్ కంపెనీ (ధమన్) ప్రవాసుల కోసం మరో ఆసుపత్రిని నిర్మించనుంది. ఇందుకోసం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని స్టేట్ ప్రాపర్టీ డిపార్ట్‌మెంట్‌తో లీజు ఒప్పందంపై సంతకం చేసింది. బిడ్ డాక్యుమెంట్‌లో నిర్దేశించిన విధంగా ధమన్‌ఆస్ హెల్త్ నెట్‌వర్క్‌లో భాగంగా కేటాయించిన భూమిని స్వీకరించడానికి స్టేట్ ప్రాపర్టీ అఫైర్స్, లీగల్ అఫైర్స్, స్టేట్ ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్ ఖుదైర్ అల్-ఖమీస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫర్వానియా గవర్నరేట్‌లోని దజీజ్ ప్రాంతంలో మూడవ ఆసుపత్రిని అభివృద్ధి చేయనున్నారు. కంపెనీ తన హెల్త్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, ఆరోగ్య సేవలను పెంచడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ‘ధమన్’ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త ఆస్పత్రి దాదాపు 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రానుందని సీఈవో థామర్ అరబ్ తెలిపారు. న్యూ కువైట్ 2035 విజన్‌లోని హెల్త్‌కేర్ అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో ఒకటైన ధమన్.. కువైట్‌లోని ఆరోగ్య సంరక్షణ రంగానికి క్వాంటం లీప్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అరబ్ వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..