శంషాబాద్ ఎయిర్పోర్టులో మహిళ నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం..
- May 08, 2023
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ కలకలం రేగింది. డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 5కిలోల హెరైయిన్ ను సీజ్ చేశారు. హెరాయిన్ విలువ మార్కెట్ లో రూ.41 కోట్లు ఉంటుందని తెలిపారు. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి డీఆర్ఐ అధికారులు హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అధికారులు.
మహిళా ప్రయాణికురాలు మాలావి నుంచి దోహ మీదుగా హైదరాబాద్ వచ్చింది. సూట్ కేసులో హెరాయిన్ పెట్టుకుని వచ్చిందా మహిళ. 5.9 కిలోల హెరాయిన్ పట్టుబడగా, దాని విలువ రూ.41.3కోట్లు ఉంటుందని తెలిపారు.
ఈ నెల 7న మహిళా ప్రయాణికురాలు మాలావి నుంచి దోహా మీదుగా హైదరాబాద్ చేరుకుందని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే అధికారులు ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆమె దగ్గరున్న సూట్ కేసులో ఏదో ఉందనే అనుమానం కలిగింది. అంతే, సూట్ కేసును మరింత జాగ్రత్తగా చెక్ చేశారు. అందులో తెల్లటి పౌడర్ ఉంది. అది క్రీమ్ రూపంలో ఉంది. అధికారుల్లో అనుమానం పెరిగిపోయింది.
ఏంటా పౌడర్ అని ప్రత్యేక పరికరాలతో చెక్ చేయగా షాకింగ్ నిజం తెలిసింది. అది హెరాయిన్ అతి తేలడంతో నివ్వెరపోయారు. 5.9 కిలోల ఉన్న ఆ హెరాయిన్ ధర బహిరంగా మార్కెట్ లో రూ.41.30 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
భారత్ కు చెందిన మహిళా ప్రయాణికురాలు మాలావి నుంచి హెరాయిన్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హెరాయిన్ ను ఆ మహిళ హైదరాబాద్ లో ఎవరికి చేరవేయాలకున్నారు? అనే దానిపై ఆరా తీస్తున్నారు.
అయితే, శంషాబాద్ ఎయిర్ పోర్టులో తాము చెప్పిన ప్రాంతానికి హెరాయిన్ ను చేరవేస్తే కొంత డబ్బు ఇచ్చేలా ఆ మహిళతో దుండగులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాదు, హైదరాబాద్ లో హెరాయిన్ ను తీసుకునే వాళ్ల వివరాలు కూడా నిందితురాలికి తెలిసి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. మొత్తంగా ఎయిర్ పోర్టులో భారీ మొత్తంలో కోట్ల రూపాయలు విలువ చేసే హెరాయిన్ పట్టుబడటం కలకలం రేపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!