మొట్టమొదటి లేబర్ మార్కెట్ అవార్డును ప్రకటించిన యూఏఈ

- May 10, 2023 , by Maagulf
మొట్టమొదటి లేబర్ మార్కెట్ అవార్డును ప్రకటించిన యూఏఈ

యూఏఈ: యూఏఈలోని గృహ కార్మికులు, కార్మికులు, కంపెనీలు, వ్యాపారులకు మొట్టమొదటి సారిగా ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డును అందజేయనున్నారు. మూడు కేటగిరీలుగా విభజించబడిన ఈ అవార్డు.. ఉత్తమ ప్రదర్శన చూపే కార్మికులు, కంపెనీలను ప్రోత్సహిస్తుంది. కార్మిక మార్కెట్‌ను మెరుగుపరచడం, కంపెనీల పని వాతావరణాన్ని గుర్తించడం, ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని పెంచడం, పోటీతత్వాన్ని పెంపొందించడంతోపాటు దేశంలోని శ్రామికశక్తి శ్రేయస్సును మెరుగుపరచడానికి ఈ అవార్డు దోహదం చేస్తుందని ఎమిరటైజేషన్ (మోహ్రే) మంత్రి డాక్టర్ అబ్దుల్‌రహ్మాన్ అల్ అవార్ అన్నారు.

మొత్తం 28 కంపెనీలు ఆరు కేటగిరీల్లో వాటి పరిమాణం ఆధారంగా గుర్తించబడతాయి. ప్రతి విభాగంలో నలుగురు విజేతలతో, నైపుణ్యం, నైపుణ్యం లేని మరియు సాధారణ విభాగాల్లో ఉద్యోగులు గుర్తించి అవార్డులను అందజేస్తారు. గృహ కార్మికుల రిక్రూట్‌మెంట్, ఉపాధి ఏజెన్సీలు, వ్యాపార కేంద్రాలు అనే మూడు విభాగాలలో వ్యాపారాలకు అవార్డులతో సత్కరిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com