జీవో నంబరు 1ని కొట్టేసిన ఏపీ హైకోర్టు
- May 12, 2023
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని ఇరుకు రోడ్లలో సభలు, రోడ్ షోలను నియంత్రించేలా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది. జీవో నంబరు 1 (GO No.1)ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ ఏడాది జనవరి 2న ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
దీన్ని సవాలు చేస్తూ అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై జనవరి 24న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇవాళ తీర్పు వెలువరించింది. GO No.1తో ప్రాథమిక హక్కులకు విఘాతమని హైకోర్టు తెలిపింది. ఈ జీవో చాలా అన్యాయమంటూ ఏపీలోని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.
కాగా, ప్రజల భద్రత దృష్ట్యా రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ జీవో నంబరు 1ని తీసుకొచ్చినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. దీని ప్రకారం జాతీయ, రాష్ట్ర, మునిసిపల్, పంచాయతీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధించింది. సభలు, ర్యాలీను ప్రజలకు ఇబ్బందు కలగని ప్రాంతాల్లోనే నిర్వహించుకోవాలని ఏపీ సర్కారు పేర్కొంది. ఒక వేళ ఉల్లంఘిస్తే సభలు, ర్యాలీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









