ఏందిది పూరీ.! విజయ్‌ని అలా ఇరికించేశావ్.!
- May 13, 2023
‘లైగర్’ సినిమా విజయ్ దేవరకొండ కొంప ముంచేసింది. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి కామనే. కానీ, కోలుకోలేని దెబ్బ తినేశాడు ‘లైగర్’తో విజయ్ దేవరకొండ.
ఆ దెబ్బ నుంచి కోలుకోవడం విజయ్ దేవరకొండ వల్ల కావడం లేదు. ఇదిలా వుంటే, తాజాగా పూరీతో ఇంకో సినిమాకి సిద్ధమయినట్లు తెలుస్తోంది.
రేపో మాపో ఆ కొత్త సినిమాని అనౌన్స్ చేసే యోచనలో వున్నాడట పూరీ జగన్నాధ్. ఇదిలా వుంటే, ‘లైగర్’ వల్ల తామెంతో నష్టపోయామంటూ ఆ నిర్మాతలూ, డిస్ర్టిబ్యూటర్లూ రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఈ పరిణామం విజయ్ దేవరకొండ ఇమేజ్‌కి ఇంకాస్త డ్యామేజ్ తెచ్చిపెట్టేలా వుంది. ‘ఖుషి’ సినిమాపై రౌడీ ఆశలు పెట్టుకున్నాడు.
ఓకే, ఈ సినిమా నుంచి వస్తున్న ప్రచార చిత్రాలూ మొన్న వచ్చిన ‘నా రోజా నువ్వే..’ సాంగ్‌కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ఒకింత రౌడీ మనసు కుదుప పడేలా చేశాయనే చెప్పాలి.
కానీ, పూరీతో మళ్లీ కొత్త ప్రాజెక్ట్ అంటేనే కాస్త డౌట్ కొడుతోంది. జర శోచాయించు రౌడీ.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!