ఖతార్ టూరిజం: మే నెలలో అనేక స్పెషల్ వేసవి ఈవెంట్‌లు

- May 14, 2023 , by Maagulf
ఖతార్ టూరిజం: మే నెలలో అనేక స్పెషల్ వేసవి ఈవెంట్‌లు

దోహా: ఖతార్ ఈ వేసవిలో యాక్షన్-ప్యాక్డ్ ఈవెంట్‌లు, అద్భుతమైన అనుభవాలను నిర్వహించనుంది. ఖతార్ టూరిజం (QT) మే చివరిలో కుటుంబ-కేంద్రీకృత కార్యక్రమాల ఉత్తేజకరమైన జాబితాను ఆవిష్కరిస్తుంది. ఆకర్షణీయమైన ప్రదర్శనల నుండి ఉత్తేజకరమైన కార్యకలాపాల వరకు ప్రతి ఒక్కరూ ఆనందించడానికి అవకాశం ఉంది.
ఖతార్ టూరిజం (QT) సీఓఓ బెర్తోల్డ్ ట్రెంకెల్ మాట్లాడుతూ..ఈవెంట్‌లు కుటుంబాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. మే నెలాఖరులోగా క్యూటీ సమ్మర్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని, ప్రజలందరూ వేచి ఉండాలని ఆయన అన్నారు. అనేక ఆసక్తికరమైన వినోదాత్మక కార్యక్రమాలను కలిగి ఉన్నామని, టూరిస్టులకు అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటిస్తామని తెలిపారు. ప్రపంచకప్‌ తర్వాత మేమంతా ఉత్సాహంగా ఉన్నామని, చాలా కొత్త ప్రాజెక్టులు చేయాల్సి ఉంది అని ట్రెంకెల్ చెప్పారు. 
QRS ట్రాక్ ఛాలెంజ్ 2023 నిన్న ప్రారంభమైంది. మరో రెండు రేసులను త్వరలో నిర్వహించనున్నారు. మే 19 - 26 తేదీల్లో ఖతార్ స్పోర్ట్స్ క్లబ్‌లో బిల్డ్ యువర్ హౌస్, నిర్మాణానికి అంకితమైన కొత్త ఫార్మాట్ ఎగ్జిబిషన్ మే 15 నుండి 18 వరకు QNCCలో నిర్వహించబడుతుంది. ఖతార్ విశ్వవిద్యాలయంలో మే 16-18 తేదీల్లో ఖతార్ CSR సమ్మిట్, మే 16న దుహైల్ హ్యాండ్‌బాల్ స్పోర్ట్స్ హాల్‌లో ఖతార్ కప్ హ్యాండ్‌బాల్ ఫైనల్ ఉంది. లైనప్‌లో 'డిస్కవర్ వేల్ షార్క్స్ ఆఫ్ ఖతార్' మే 18 నుండి 31 వరకు అల్ రువైస్ పోర్ట్‌లో నిర్వహించనున్నారు.మే 20-22 పార్క్ హయత్ హోటల్‌లో MENA Insurtech సమ్మిట్, Google క్లౌడ్ రీజియన్ మే 22న QNCCలో ప్రారంభించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com