10వ సారి కింగ్స్ కప్ గెలుచుకున్న అల్-హిలాల్

- May 14, 2023 , by Maagulf
10వ సారి కింగ్స్ కప్ గెలుచుకున్న అల్-హిలాల్

జెడ్డా: కింగ్ అబ్దుల్లా స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్, ఇతర ఉన్నతాధికారులు వీక్షించిన కింగ్ కప్ ఆఫ్ ఛాంపియన్స్ ఫైనల్‌లో శుక్రవారం అల్-హిలాల్ ఫుట్‌బాల్ జట్టు పెనాల్టీలో 8-7తో అల్-వెహ్దాను ఓడించింది. ఈ విజయంతో రియాద్‌కు చెందిన అల్-హిలాల్ 66వ ట్రోఫీని.. 10వ కింగ్స్ కప్ ని.. ఈ సీజన్‌లో మొదటి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు హాజరై అల్-హిలాల్‌కు కప్‌ను అందించారు. ఒక వారం క్రితం అల్-హిలాల్ AFC ఛాంపియన్స్ లీగ్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన ఉరవ రెడ్ డైమండ్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసినదే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com