కస్టడీ రిజల్ట్: ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ సంగతేంటో.!

- May 15, 2023 , by Maagulf
కస్టడీ రిజల్ట్: ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ సంగతేంటో.!

‘కస్టడీ’ సినిమా ఫెయిల్యూర్ కావడంతో డైరెక్టర్ వెంకట్ ఫ్రభు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ‘కస్టడీ’ రిలీజ్‌కి ముందే భారీ అంచనాలు నమోదు చేసింది.

దాంతో, ఈ సినిమా రిలీజ్‌కి ముందే ఓ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నాడు వెంకట్ ప్రభు. రేపో మాపో ఆ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ కావల్సి వుండగా, ‘కస్టడీ’కి దారుణమైన రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్.

కనీసం చైతూ స్థాయి ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోయింది ఈ సినిమా. దాంతో, ఆ ఇంపాక్ట్ వెంకట్ ప్రభు తదుపరి ప్రాజెక్ట్‌పై ఎక్కువగా పడింది. 

దాంతో, ఇప్పుడా ప్రాజెక్ట్ డైలమాలో పడిందని అంటున్నారు. అబ్బే.! అలాంటిదేం లేదు.. ఆ ప్రాజెక్ట్ దాదాపు సెట్ అయిపోయినట్లే.. త్వరలోనే అనౌన్స్ చేస్తామని వెంకట్ ప్రభు అంటున్నట్లుగా ఇన్ సైడ్ సోర్సెస్ సమాచారం. చూడాలి మరి, ఏది నిజమో. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com