NBK 108 కోసం హనీ రోజ్‌ను దించబోతున్నారా.?
- May 17, 2023‘వీర సింహారెడ్డి’ సినిమాలో శృతి హాసన్ మెయిన్ హీరోయిన్గా నటించినప్పటికీ మరో హీరోయిన్గా నటించిన హనీ రోజ్కి మంచి క్రేజ్ వచ్చింది.
ఈ సినిమాతో హనీరోజ్ బాగా పాపులర్ అయ్యింది. అయితే, అవకాశాలు రాలేదు కానీ, సినిమా ప్రమోషన్లలో హనీ రోజ్ చాలా యాక్టివ్‌గా పాల్గొనడం, అదే టైమ్‌లో శృతి హాసన్ పెద్దగా ప్రమోషన్లకు హాజరు కాకపోవడంతో, హనీ రోజ్ పేరు మార్మోగిపోయింది.
బాలయ్య హీరోయినా.? మజాకానా.? అనే రేంజ్లో పేరు తెచ్చుకుంది హనీ రోజ్. ఇప్పుడు తన కొత్త సినిమాలో హనీ రోజ్కి ఇంకో ఛాన్స్ ఇవ్వబోతున్నాడట బాలయ్య.
అనిల్ రావిపూడితో బాలయ్య నటిస్తున్న సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీల బాలయ్యకు కూతురు పాత్రలో కనిపించనుంది.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఓ అదిరిపోయే మాస్ మసాలా స్పెషల్ సాంగ్ కోసం హనీ రోజ్ని ప్రిఫర్ చేస్తున్నాడట. దాదాపు ఓకే అయినట్లు తెలుస్తోంది. అఫీషియల్‌గా క్లారిటీ రావాల్సి వుంది.
తాజా వార్తలు
- జీ-7: ముగిసిన ప్రధాని మోదీ పర్యటన..
- హజ్ మొదటి రోజు..1.5 మిలియన్లకు పైగా యాత్రికులు రాక
- మహ్బౌలాలోని బేస్మెంట్ లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
- విజయవాడ-ముంబై విమాన సర్వీస్ ప్రారంభం
- ఖతారీ ప్రాదేశిక జలాల్లో స్పిన్నర్ డాల్ఫిన్లు సందడి
- ఒమన్‌లో ప్రీ-ఈద్ 'హబ్తా' సౌక్లు
- 7 సెషన్.. ఇటలీకి చేరుకున్న యూఏఈ ప్రెసిడెంట్
- విద్యార్థి నిజాయితీ..సత్కరించిన దుబాయ్ పోలీసులు
- కువైట్ అగ్ని ప్రమాద బాధితులకు సాయం..
- టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు..