రూమర్స్‌పై మెగా డాటర్ ఘాటు స్పందన.!
- May 17, 2023
డేరింగ్ అండ్ డాషింగ్ మెగా డాటర్ నిహారిక ఈ మధ్య సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిల ట్రోల్స్‌కి టార్గెట్ అవుతున్న సంగతి తెలిసిందే.
భర్తతో విడాకుల ఇష్యూ కావచ్చు.. సాయి ధరమ్ తేజ్‌తో రెండో వివాహమట.. అంటూ రకరకాల ట్రోల్స్‌తో నెట్టింట వైరల్ అవుతోంది నిహారిక కొణిదెల.
అయితే, ఈ ట్రోల్స్‌పై ఇంతవరకూ రెస్పాండ్ కాలేదు కానీ, ఈ నెల 19న నిహారిక నటించిన ‘డెడ్ పిక్సల్స్’ అనే వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో హుషారుగా పాల్గొంటోంది నిహారిక. ఈ క్రమంలోనే ఆమెపై వస్తున్న ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించింది.
పనీ పాటా లేని వాళ్లే ఇలాంటి ట్రోల్స్ చేస్తుంటారు. వాటికి రెస్పాండ్ అయితే, వాళ్లని మరింత ఎంకరేజ్ చేసినట్లవుతుంది. అలాంటి వేస్ట్ ట్రోల్స్‌ని నేను పట్టించుకోను.. అని గట్టిగా రెస్పాండ్ అయ్యింది.
నాలుగేళ్లుగా యాక్టింగ్ నుంచి విరామం తీసుకున్న నిహారిక మళ్లీ ‘డెడ్ పిక్సల్స్’ ద్వారా ముఖానికి రంగేసుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 19 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ర్టీమింగ్ కానుంది.
తాజా వార్తలు
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి