సైబర్ థ్రెట్స్ నుండి పిల్లలను రక్షించాలి.. పేరెంట్స్ కు అలెర్ట్
- May 18, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని తల్లిదండ్రులు తమ పిల్లలకు సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్లు, అన్ని రకాల ఎలక్ట్రానిక్ గేమ్ యాప్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలని యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్‌లోని చైల్డ్ సైబర్ ప్రొటెక్షన్ యూనిట్ సూచించింది. ఏదైనా ముప్పు లేదా ప్రమాదానికి గురైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయాలను వారికి అవగాహన కల్పించడంతో పాటు, పిల్లలను నిరంతరం గమనించాలని, పిల్లలు ఉపయోగించే అప్లికేషన్లను తరచూ చెక్ చేయాలని సలహా ఇచ్చింది.
బహ్రెయిన్ బయటి నుండి గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు కొన్ని అప్లికేషన్లలో నకిలీ పేర్లు, ఖాతాలను ఉపయోగించి పిల్లలను చీట్ చేస్తున్నారని నివేదికలు అందాయని పేర్కొంది. యూనిట్‌కు వ్యక్తిగతంగా నివేదించడం, హాట్‌లైన్ (992)కి కాల్ చేయడం లేదా అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి యూనిట్‌కి ([email protected]) ఇమెయిల్ పంపడం ద్వారా ఇటువంటి ఉల్లంఘనలు లేదా బెదిరింపుల గురించి అధికారిక నివేదికను సమర్పించాలని తల్లిదండ్రులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







