పవర్ స్టార్ హుషారు మామూలుగా లేదుగా.!
- May 18, 2023పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చాలా సజావుగా సాగుతోందనే చెప్పాలి. ఓ వైపు సినిమాలూ, మరోవైపు రాజకీయం.. ఇలా రెండింటినీ ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు.
స్టార్ హీరోల్లో ఎవ్వరూ చేయలేని దూకుడు ప్రదర్శిస్తున్నారు సినిమాల్లో. ఎంత ఫాస్ట్‌గా సినిమాలు ఓకే చేశారో.. అంతే ఫాస్ట్‌గా ఆయా సినిమాల్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు.
ఒక్క సినిమా కాదు, సమాంతరంగా రెండు మూడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీగా వున్నారు. తాజాగా ‘ఓజీ’ కోసం ముంబయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని, హైద్రాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్‌కి తనను తాను సిద్ధం చేసుకున్నారు.
ఆల్రెడీ కంప్లీట్ చేసిన ‘వినోదయసితం’ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ఈ రోజు అనగా మే 18న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ సినిమాకి ‘బ్రో’ అనే టైటిల్ ప్రచారంలో వుండగా, మరి కాసేపట్లో అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ