ఆర్టీఏ తనిఖీల్లో అడ్డంగా దొరికిన పలువురు ప్రయాణికులు
- May 19, 2023
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఇటీవల వరుస తనిఖీ ప్రచారాలను నిర్వహించింది. ఈ సందర్భంగా పబ్లిక్ బస్సులలో వారి నోల్ కార్డ్‌లను ట్యాప్ చేయని ప్రయాణికులను గుర్తించి వారిపై ఉల్లంఘనలను నమోదు చేసింది. మాస్ ట్రాన్సిట్ నియమాలు, నిబంధనలకు రైడర్ల నిబద్ధతను నిర్ధారించే లక్ష్యంతో రసిద్ ప్రచారం జరిగిందని ఆర్టీఏ తెలిపింది.
ఆరు రోజుల వ్యవధిలో RTA 40,000 తనిఖీలను నిర్వహించింది. దీని ఫలితంగా 1,193 ఉల్లంఘనలను నమోదు చేశారు. దుబాయ్ అమెరికన్ అకాడమీ, అల్ ఖైల్ గేట్, అల్ క్యూజ్, మజ్లిస్ అల్ గరీఫా, బుర్జ్ అల్ అరబ్ హోటల్, అల్ వాస్ల్ స్ట్రీట్‌తో సహా ఎమిరేట్‌లోని వివిధ ప్రాంతాలలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆర్టీఏ తెలిపింది.
దుబాయ్ పోలీసులు, దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఫారినర్స్ అఫైర్స్‌తో సహా అనేక సంబంధిత సంస్థల సమన్వయంతో ఈ ప్రచారాలు నిర్వహించినట్లు RTA పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో ప్రయాణీకుల రవాణా కార్యకలాపాల పర్యవేక్షణ డైరెక్టర్ సయీద్ అల్ బలూషి తెలిపారు. పబ్లిక్ బస్సు వినియోగదారుల ద్వారా ఛార్జీల ఎగవేతను తగ్గించడం, ఈ విషయంలో అనధికారిక కార్యకలాపాలను నియంత్రించడం లక్ష్యంగా తనిఖీలు సాగాయన్నారు. సంబంధిత ఛార్జీలను నోల్ కార్డులను ఉపయోగించి చెల్లించాలని అల్ బలూషి ప్రయాణికులను కోరారు.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









