కార్న్ ఆలం విమానాశ్రయం కార్యకలాపాలు పునఃప్రారంభం..!

- May 20, 2023 , by Maagulf
కార్న్ ఆలం విమానాశ్రయం కార్యకలాపాలు పునఃప్రారంభం..!

మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని కార్న్ ఆలం విమానాశ్రయం నిర్వహణ పనుల కోసం కొన్ని నెలలపాటు నిలిపివేయబడిన తర్వాత దాని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన అథారిటీ (సీఏఏ) శుక్రవారం తెలిపింది. "నిర్వహణ పనిని పూర్తి చేయడానికి అనేక నెలల పాటు కార్న్ ఆలం విమానాశ్రయంలో కార్యకలాపాలను మూసివేసిన తరువాత  సివిల్ ఏవియేషన్ అథారిటీ, రన్‌వేని పరిశీలించింది. అది కార్యాచరణ భద్రతకు అనుగుణంగా ఉందని నిర్ధారించారు. త్వరలోనే ఆపరేషన్ల నిర్వహణకు అనుమతి వస్తుంది. పౌర విమానయాన సాంకేతిక వ్యవస్థలకు అనుగుణంగా అవసరాలు, ప్రమాణాలు ఉన్నాయి." అని అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అథారిటీ జారీ చేసిన జాతీయ నిబంధనలకు అనుగుణంగా విమానాశ్రయ నిర్వహణ లైసెన్స్‌ను పునరుద్ధరించే లక్ష్యంతో విమానాశ్రయంలో సమగ్ర పరీక్ష కూడా నిర్వహించబడిందని సీఏఏ  వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com