‘సింహాద్రి 4k’ హిట్టా.? ఫట్టా.?
- May 23, 2023ఎన్టీయార్ బర్త్ డే సందర్భంగా ‘సింహాద్రి’ సినిమాని రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. భారీ ఎత్తున హంగామా చేసి ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు.
అంతా బాగానే వుంది. ఇంతకీ ‘సింహాద్రి’ రీ రిలీజ్ హిట్టా.? ఫ్లాపా.? అనే చర్చ నడుస్తోందిప్పుడు. రీ రిలీజ్ సందర్భంగా 8 కోట్లు వసూళ్లు సాధించిందని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంత.?
ఫస్ట్ రిలీజ్ టైమ్‌లోనూ సింహాద్రిని బలవంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆడించారన్న టాక్ వుంది. తద్వారా వచ్చిన సొమ్ములు తిరిగి దానికే ఖర్చు చేయడంతో, భారీగా నష్టపోయారు నిర్మాతలు అనే ప్రచారం వుంది.
అదే తప్పు ఇప్పుడు కూడా చేస్తున్నారా.? ఎందుకంత పంతం.? హార్ట్ ఫుల్‌గా ఆడితే ఆడిందని చెప్పాలి. కానీ, ఎందుకీ దాగుడుమూతలు దండాకోర్.. అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
రీసెంట్గా రామ్ చరణ్ ఫ్లాప్ మూవీ అయిన ‘ఆరెంజ్’ని రీ రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు రాబట్టింది. అప్పుడు నష్టపోయిన నిర్మాతలు ఇప్పుడు చాలా చాలా హ్యాపీ పీలయ్యారు ‘ఆరెంజ్’ సినిమా విషయంలో.
అలా వుండాలే కానీ, ‘సింహాద్రి’ విషయంలో జరుగుతున్న ఈ అత్యుత్సాహం వల్ల ఎవరికి లాభం.?
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..