‘పుష్ప 2’ ప్యాన్ ఇండియా పాట్లు.!
- May 24, 2023‘పుష్ప’ సినిమా బాలీవుడ్లో అత్యధిక ఆదరణ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌కి వచ్చిన ఆదరణతో రెండో పార్ట్‌ని భారీ స్థాయిలో తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సుకుమార్ అండ్ టీమ్.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. కాగా, ఈ సారి నార్త్ జనాల్ని గట్టిగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే, బాలీవుడ్ జనాన్ని కూడా ఈ సినిమాలో భాగం చేయాలనుకుంటున్నారనీ తెలుస్తోంది.
ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడ్ని ‘పుష్ప2’ కోసం తీసుకోవాలనుకుంటున్నారట. జస్ట్ కొన్ని సెకన్ల పాటు మాత్రమే వుండే పాత్రట అది. ఇంపార్టెంట్ గెస్ట్‌గా ఆ నటుడికి ఈ సినిమాలో భాగం చేయాలనుకుంటున్నారట.
ఆ లిస్టులో ప్రముఖంగా రణ్ వీర్ కపూర్ పేరు వినిపిస్తోంది. ఈ మధ్య బాలీవుడ్ నటులు టాలీవుడ్ సినిమాల్లో గెస్ట్లుగా కనిపించేందుకు అత్యుత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే.
జరుగుతున్న ప్రచారం నిజమే అయితే, రణ్వీర్ అప్పియరెన్స్ ‘పుష్ప 2’కి ఖచ్చితంగా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ