ప్రముఖ నటుడు చంద్రమోహన్ కు ఎన్.టీ.ఆర్ అవార్డు
- May 24, 2023హైదరాబాద్: వంశీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహణలో విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ముగింపు వేడుకల్లో భాగంగా ప్రముఖ నటుడు చంద్రమోహన్ కు ఎన్.టీ.ఆర్ అవార్డు, ఫిల్మ్ నగర్ లోని ఆయన స్వగృహంలో లక్ష్మీనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొని బహుకరించారు.విశ్రాంత జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... నేడు సినిమా క్రికెట్, క్రైమ్ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయని కుటుంబ వ్యవస్థ ను బలీయం చేసే చిత్రాలకు ఆదరణ లేదని లక్ష్మీ నారాయణ ఆన్నారు.కుటుంబ కధా చిత్రాలలో చంద్ర మోహన్ నటన విలక్షణ మన్నారు. ఎన్.టి.ఆర్ వంటి మహోన్నత నటుడు తెలుగు వారు కావటం జాతి అంతా గర్వించాలని అన్నారు. దర్శకుడు రేలంగి నరసింహా రావు మాట్లాడుతూ...చంద్ర మోహన్ తో తాను 25 సినిమాలకు దర్శకత్వం వహించనని మంచి ఈజ్ ఉన్న నటుడని అభినందించారు. వంశీ రామరాజు నిర్వహించిన కార్యక్రమంలో జలందర చంద్ర మోహన్ దైవజ్ఞ శర్మ,దేశాయి, శ్రీదేవి, శైలజ, డాక్టర్ సుధ, రాశీ మూవీస్ నర సింహారావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి