ఫిలిపినోలపై కొనసాగుతున్న నిషేధం
- May 25, 2023
కువైట్: కువైట్ సార్వభౌమాధికారం లేదా కువైట్ పౌరుల గౌరవానికి భంగం కలిగించే ఏ విధమైన ఉల్లంఘనైన సహించేది లేదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. కార్మికుల ఉల్లంఘనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి ఉద్దేశించిన కువైట్ షరతులను మనీలా తిరస్కరించినందున, ఫిలిప్పీన్స్ పౌరులకు ఎలాంటి వీసాల జారీని చేపట్టడం లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. "మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి , రక్షణ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్ సూచనల మేరకు కువైట్ ఇతర దేశాలతో ఒప్పందాల ద్వారా తన లేబర్ మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలు, నైపుణ్యాన్ని అవుట్సోర్స్ చేయడానికి కృషి చేస్తోంది.’’ అని పేర్కొంది.
ఫిలిప్పీన్స్ ప్రభుత్వం నుండి వచ్చిన అభ్యర్థన మేరకు, ఫిలిప్పీన్స్ కోసం వీసాల సమస్యపై దర్యాప్తు చేయడానికి ఒక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించబడిందని, ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం కార్మిక ఒప్పందాలను ఉల్లంఘించడం, ఫిలిప్పీన్స్ కార్మికుల చట్టవిరుద్ధమైన పద్ధతులు, నేరాల విషయంలో స్పష్టత రానందున వీసాల జారీని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిలిపివేస్తునట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







