‘మళ్లీ పెళ్లి’ని బ్యాన్ చేయాల్సిందే - నరేష్ మూడో భార్య.!
- May 25, 2023సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ జంటగా ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రేపు అనగా మే 26న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది.
గత నెల రోజులుగా ఈ సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు నరేష్, పవిత్ర లోకేష్. ఎక్కడికక్కడ ప్రత్యేకమైన వేదికలు నిర్వహిస్తూ, ఆయా వేదికలపై వారి వారి లైవ్ రొమాన్స్, రొమాంటిక్ డాన్సింగ్ స్టెప్పులు.. ఇలా పనికిమాలిన పైత్యం చూపిస్తూ చెత్త చెత్త చేస్తున్నారు.
ఇక, రిలీజ్ టైమ్ రానే వచ్చింది. సరిగ్గా ఇదే టైమ్‌లో నరేష్ మూడో భార్య రంగంలోకి దిగింది. ఈ సినిమాలో తనకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను అభ్యంతరకరంగా చూపించారంటూ ఆమె మీడియాకెక్కింది. ఎలాగైనా సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది.
తనకు విడాకులివ్వకుండానే నరేష్, పవిత్రతో కలిసి వుంటున్నాడని ఆమె వాదిస్తోంది. మరి, ఈ వివాదం నరేష్ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతుందా.? లేక అడ్డంకిగా మారి సినిమా రిలీజ్ కాకుండా ఆపగలుగుతుందా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ