అరేబియా గల్ఫ్ స్ట్రీట్‌లో హిట్ అండ్ రన్ ఘటన.. 11 మందికి గాయాలు

- May 27, 2023 , by Maagulf
అరేబియా గల్ఫ్ స్ట్రీట్‌లో హిట్ అండ్ రన్ ఘటన.. 11 మందికి గాయాలు

కువైట్: అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన హిట్ అండ్ రన్ కేసులో 11 గాయపడ్డారు.  వీరందరూ ఫిలిప్పీన్స్‌కు చెందినవారు. ఫిలిపినోల బృందం సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురు సైక్లిస్టులు గాయపడ్డారు. వారిని ఢీకొట్టిన కారు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అనంతరం అధికారుల వద్ద లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. లైసెన్స్ లేకుండా సైకిల్ క్రీడను ప్రాక్టీస్ చేయడం వారి ప్రాణాలకు ప్రమాదకరమని పేర్కొంటూ, ప్రధాన, పబ్లిక్ రోడ్లపై క్రీడలను అభ్యసించే వారందరూ నియంత్రణ చట్టాలకు కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.

ఇదిలా ఉండగా అరేబియా గల్ఫ్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన తొమ్మిది మందిని ప్రథమ చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరో ఇద్దరు వ్యక్తులు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారని, ఒకరు ఐసియులో.. మరొకరు గైనకాలజికల్ సర్జరీ వార్డులో ఉన్నారని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com