హజ్ కోసం 22,000 మంది నియామకం
- May 29, 2023
రియాద్: యాత్రికులకు సేవలు అందించేందుకు వీలుగా 22,000 మంది కార్మికులను రిక్రూట్ చేయడంతో సహా హజ్ కోసం సన్నాహాలు పూర్తి చేసినట్లు మక్కా మున్సిపాలిటీ వెల్లడించింది. మునిసిపాలిటీ తన అన్ని మానవ, యాంత్రిక సామర్థ్యాలను సమీకరించిందని, ప్రజా భద్రత మరియు స్కౌట్స్, తాత్కాలిక ఆరోగ్య మానిటర్లు, అలాగే పెద్ద సంఖ్యలో పరికరాలు, యంత్రాలతో సహా సహాయక బృందాల మద్దతుతో మునిసిపల్ సేవలను అత్యున్నత స్థాయిలో యాత్రికులకు సేవలు అందించడానికి మునిసిపాలిటీ సిద్ధంగా ఉందని అధికార ప్రతినిధి ఒసామా జైతునీ తెలిపారు. మున్సిపాలిటీ తన 13 సబ్-మునిసిపాలిటీలు, మూడు అనుబంధ మునిసిపాలిటీలు, అలాగే మక్కాలోని 28 కేంద్రాలకు అవసరమైన సిబ్బందిని తరలించి విధులు కేటాయించినట్లు జైతునీ తెలిపారు.
కాగా, నైజీరియా నుంచి వచ్చిన హజ్ యాత్రికుల తొలి బృందాన్ని శనివారం జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్‌లు స్వాగతం పలికింది. ఇరాన్ నుండి హజ్ యాత్రికులతో మరో విమానం మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విమానాశ్రయాలు, భూ సరిహద్దులు, ఓడరేవుల వద్ద హజ్ సమయంలో యాత్రికుల కోసం విధివిధానాలను సమర్థవంతంగా నిర్వహించడానికి డైరెక్టరేట్ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







