తేజ నిజాయితీ ‘అహింస’ని ఆదుకుంటుందా.?
- May 30, 2023
డైరెక్టర్ తేజ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ ఆయన. కానీ ఇప్పుడు కాదు. అయినా ఆయన తీరు మారలేదు. ప్రస్తుతం ‘అహింస’ అనే సినిమా తెరకెక్కించాడు.
ఈ సినిమాతో రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్నాడు. అభిరామ్‌ని హీరోగా చూపించాలని దివంగత రామానాయుడు దగ్గర మాట తీసుకున్నాడట తేజ. అందుకే అభిరామ్‌ని హీరో చేసే బాధ్యత మర్చిపోకుండా తేజ తీసుకున్నాడట. అదే విషయం స్వయంగా ఇప్పుడు ఆయనే చెబుతున్నారు.
అంతే కాదు, అభిరామ్‌ని హీరోని చేయడం తండ్రి సురేష్ బాబుకే ఇష్టం లేదట. ‘అహింస’ సినిమా 90 శాతం పూర్తయ్యాకా కూడా సినిమాని ఆపేయమన్నాడట సురేష్ బాబు.
కానీ, తండ్రి మాట గుర్తొచ్చి మళ్లీ వెనక్కి తగ్గాడట. ఇలా సినిమా కోసం ప్రమోషన్లలో భాగంగా తేజ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకింత నెగిటివిటీ మూట కట్టుకుంటున్నారు కూడా. అయినా డోంట్ కేర్.! ఆయన తేజ కదా.! అదే నిజాయితీ అనుకుంటారాయన. ఆ నిజాయితీ ‘అహింస’ను కాపాడుతుందా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!









