రియాద్‌లో సింహాన్ని బంధించిన ప్రత్యేక దళాలు
- June 01, 2023
రియాద్: పర్యావరణ భద్రత ప్రత్యేక దళాలు రియాద్ నగర పరిసరాల్లో తిరుగుతున్న సింహాన్ని బంధించాయి. సింహాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. అధికారిక నివేదికల ప్రకారం.. ప్రత్యేక దళాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. సింహాన్ని బంధించి వన్యప్రాణి అథారిటీకి అప్పగించారు.
పర్యావరణ చట్టంలోని నిబంధనల ప్రకారం.. అంతరించిపోతున్న వన్యప్రాణులతో వ్యాపారం చేయడంతో పాటు వాటిని స్వాధీనంలో పెట్టుకోవడం నిషేధించబడిందని ప్రత్యేక దళాలు పేర్కొన్నాయి. ఇందులు పాల్పడిన వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా గరిష్టంగా SR30 మిలియన్ జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్‌లోని ప్రాంతాలలో 911 నంబర్‌కు.. కింగ్‌డమ్‌లోని మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా పర్యావరణం లేదా వన్యప్రాణులపై ఏవైనా దాడులు జరిగినప్పుడు రిపోర్ట్ చేయాలని స్పెషల్ ఫోర్సెస్ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







