137 సంస్థలపై 65.9 మిలియన్ దిర్హామ్‌ల జరిమానా

- June 02, 2023 , by Maagulf
137 సంస్థలపై 65.9 మిలియన్ దిర్హామ్‌ల జరిమానా

యూఏఈ: 2023 మొదటి త్రైమాసికంలో మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ (AML/CFT) చట్టం నిబంధనలు పాటించని సంస్థలపై యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ భారీ జరిమానాలు విధించింది. నాన్-ఫైనాన్షియల్ బిజినెస్ లేదా ప్రొఫెషన్స్ (DNFBP) విభాగంలో పనిచేస్తున్న 137 కంపెనీలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ Dh65.9 మిలియన్ల విలువైన జరిమానాలను విధించింది. మనీలాండరింగ్ నిరోధకం, ఉగ్రవాదం, చట్టవిరుద్ధ సంస్థలకు ఆర్థిక సహాయం చేయడం, దాని కార్యనిర్వాహక నిబంధనలు, సంబంధిత చట్టాలను ఎదుర్కోవడంపై 2018 ఫెడరల్ డిక్రీ-లా నెం. 20 ద్వారా నిర్దేశించబడిన నిబంధనలను ఆయా సంస్థలు ఉల్లంఘించాయని మినిస్ట్రీ ఆఫ్ కంట్రోల్ అండ్ ఫాలో-అప్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్లా సుల్తాన్ అల్ ఫ్యాన్ అల్ షమ్సీ  తెలిపారు. మొత్తం 137 సంస్థలలో 831 ఉల్లంఘనలు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com