‘పరేషాన్’కి అలా కలిసొచ్చింది.!
- June 02, 2023'మసూద’ సినిమాతో గతేడాది గుర్తింపు తెచ్చుకున్న హీరో తిరువీర్. ఈ కుర్రోడి రెండో ప్రయత్నమే తాజా మూవీ ‘పరేషాన్’. ఏమంత పెద్ద హైప్ క్రియేట్ కాలేదు ఈ సినిమాపై. ఇదే రోజు తేజ ‘అహింస’ సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే, ‘స్వాతిముత్యం’ సినిమాతో ఆకట్టుకున్న బెల్లంకొండ సోదరుడు ‘నేను స్టూడెంట్ సర్’ అంటూ ఇదే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
అయితే, ఈ రెండు సినిమాలకీ టాక్ అంతంత మాత్రంగానే వచ్చింది. ఇక ముచ్చటగా మూడో సినిమా అయిన ‘పరేషాన్’ ఓ మోస్తరు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అందుకు కారణం ఈ సినిమాకి తెలంగాణా సెంటిమెంటే.
ఈ మధ్య తెలంగాణా యాసలో వస్తున్న సినిమాలు కంటెంట్‌తో సంబంధం లేకుండానే హిట్ టాక్ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోకే ‘పరేషాన్’ మూవీ కూడా వస్తుంది.
చాలా రొటీన్ లవ్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘పరేషాన్’కి యూత్‌లో ఆదరణ దక్కుతోంది. రూపక్ రొనాల్డ్ సన్ ఈ సినిమాని ఎక్కడా అతికి పోకుండా చాలా సింపుల్‌గా తెరకెక్కించాడు. సెంటిమెంట్ ఏదైతేనేం, ఎలాగూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి, హాలీడే సీజన్‌ని ‘పరేషాన్’ యూజ్ చేసుకోగలదేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు