ఆరోగ్యమే మహాభాగ్యం.! పెరుగు కన్నా మజ్జిగ మేలు.!
- June 03, 2023
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, పెరుగు కన్నా, మజ్జిగ ఇంకా మేలు చేస్తుందని చెబుతున్నారు. నిజానికి మజ్జిగకు కాలంతో సంబంధం లేదు. ఏ కాలంలోనైనా రెగ్యులర్‌గా తీసుకునే ఆహారం ఇది.
అయితే, సమ్మర్లో ఇంకాస్త ఎక్కువ దీని ఉపయోగం. మజ్జిగలో ప్రో బయోటిక్స్ పుష్కలంగా లభిస్తాయ్. అదేనండీ, మన శరీరంలోని గుడ్ బ్యాక్టీరియాని పెంచేందుకు పెరుగు తోడ్పడుతుందన్న మాట. పులియబెట్టిన పెరుగులో ఈ ప్రో బయోటిక్స్ మరింత ఎక్కువగా వుంటాయ్.
పెరుగులా కన్నా, మజ్జిగ రూపంలో తీసుకుంటే, సమ్మర్లో వచ్చే కళ్ల మంటలు, అరికాళ్ల మంటలు తగ్గుతాయ్. అలాగే శరీరాన్ని అధిక ఉష్ణోగ్రత నుంచి కాపాడి, చలవగా వుంచేందుకు తోడ్పడుతుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా మజ్జిగ ఉపయోగపడుతుంది. మజ్జిగలో కాల్షియం శాతం కూడా ఎక్కువ. అందుకే మజ్జిగను తరచూ తీసుకునే వారిలో ఎముకల పటుత్వం ఎక్కువగా వుంటుంది. ఎముకల్ని బలపరచడంలో మజ్జిగ పాత్ర చాలా ఎక్కువే.
కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కొత్తీమీర చేర్చిన మజ్జిగని తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం జిహ్విక రుచి.. రెండూను.!
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!







